మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము
సృష్టి కర్త ముక్తి దాత |2|
నా స్తుతులకు పాత్రుడా
ఆరాధన నీకే...ఆరాధన నీకే...
ఆరాధన స్తుతి...ఆరాధన ||ఆరాధన||
1)మన్నాను కురిపించినావు బండనుండి నీళ్ళిచ్చినావు
యెహోవ యీరె చూచుకొనును సర్వము సమకూర్చును…
||ఆరాధన||
ఆరాధన నీకే...ఆరాధన నీకే...
ఆరాధన స్తుతి...ఆరాధన
2) వ్యాధులను తోలగించినావు మృతులను మరి
లేపినావు
యెహోవ రాఫా స్వస్థపరచును నను
స్వస్థపరచును…
||ఆరాధన||
No comments:
Post a Comment